ప్రేమించిన యువకుడితో కూతురు పెళ్లి
కూతురు ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
కడప రిపోర్ట్- సాధారణంగా ఈరోజుల్లో కులాంతర వివాహాలంటే ఎవరు ఒప్పుకోరు. అందులో కాస్త డబ్బులు ఉన్నావారు, సమాజంలో పలుకుబడి ఉన్నవారైతే కులాంతర వివాహాలకు ససేమిరా అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ మ్మెల్యే మాత్రం తన కూతురుకు ప్రేమ పెళ్లి చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు (Proddatur) వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ (Rachamallu Siva Prasad Reddy) రెడ్డి తన మొదటి కూతురు పల్లవికి (Pallavi) తానే దగ్గరుండి మరీ ప్రేమ పెళ్లి జరిపించారు. పవన్ (Pawan) అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. ఆ తరువాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ రెండు సందర్బాల్లోను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు. ఇలా తన సొంత కూతురు ప్రేమ పెళ్లి అందులోను కులాంతర వివాహానికి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా తానే దగ్గరుండి జరిపించడం నిజంగా ఆశ్చర్యమే మరి. తన కూతురు ఇష్ట ప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ పెళ్లి జరిపించానని.. కలిసి చదువుకున్న రోజుల్లో ఇద్దరు ఇష్టపడటంతో పవన్ తో తన కుమార్తె పెళ్లి చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు. సమాజంలో అందరు ఇలా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ లా పెద్ద మనసుతో ఆలోచిస్తే ప్రేమ పెళ్లిళ్లకు డోకా ఉండదు.