3 లక్షలకు మరో కోడిని కొనుక్కెళ్లిన విదేశీయులు
పందెంకోడికోసం థాయిలాండ్ నుంచి ఏలూరు వచ్చారు.. కానీ
ఏలూరు రిపోర్ట్- సోషల్ మీడియాలో వీడియో చూసి, పందెం కోడిని కొనేందుకు ఏకంగా థాయిలాండ్ (Thailand) నుంచి నలుగురు యువతీయువకులు మొన్న ఏలూరు (Eluru) జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది భోగి పండుగ రోజున గ్రామంలో నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్న కూరాకుల రత్తయ్య (Koorakula Rathaiah) తన పుంజుతో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో 27 లక్షల కోడి (Hen) పందెం వేయగా, అది గెలిచింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. దాన్ని చూసిన థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఆ కోడి పుంజును కొనడానికి బుధవారం రంగాపురానికి వచ్చారు. ఐతే ఆ కోడి పుంజును అమ్మడానికి రత్తయ్య నిరాకరించడంతో మరో పుంజును 3 లక్షలకు కొనుక్కుని తీసుకెళ్లారు, తాము కొనుక్కోవాలనుకున్న 27 లక్షల కోడి పుంజుతో ఫోటో దిగి సంతోషపడ్డారు.