దేవర చూసి చనిపోవాలనుకున్న అభిమానితో మాట్లాడిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు హార్డ్ డై ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఆయన అభిమానుల గురించి ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటారు. తన ఫ్యాన్స్ కు ఏమైనా సమస్య వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాయం చేస్తుంటారు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు ఎన్టీఆర్ కు వీరాభిమాని. ప్రస్తుతం ఈ యువకుడు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజా సినిమా దేవర (Devara) చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనను బతికించాలని డాక్టర్లని వేడుకుంటున్నాడు కౌశిక్. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతని ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు.
తమ కొడుకును బతికించాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఎన్టీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కౌశిక్ విషయం ఎన్టీఆర్ దృష్టికి రావడంతో.. కౌశిక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకున్నారు. స్వయంగా వీడియో కాల్ చేసి తన వీరాభిమాని కౌశిక్ తో మాట్లాడారు ఎన్టీఆర్. తనకు ధైర్యం చెప్పడంతో పాటు అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతే కాదు కౌశిక్ తో కలిసి దేవర సినిమా చూస్తానని చెప్పారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.