పింఛన్లపై హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారు
జగన్ మాట తప్పడమే కాదు మడమ తిప్పారు- అచ్చెన్నాయుడు
అమరావతి రిపోర్ట్- ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పింఛన్లపై ఇచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పి, మడమ తిప్పారని అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్కొక్కరికి 30 వేల రూపాయల మేర ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 200 ఉన్న పింఛన్‌ను చంద్రబాబు 2వేలకు పెంచారని, కానీ సీఎం జగన్ ఐదేళ్లలో కేవలం 750 రూపాయలు మాత్రమే పెంచారని విమర్శించారు.