Pawan _

ఇల్లు, క్యాంపు ఆఫీసు నిర్మాణానికి ఏర్పాట్లు

పిఠాపురంలో 3 ఎకరాల భూమి కొన్న పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు పిఠాపురంలో స్థలం కొని, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు వేర్వేరు బిట్లు కొనుక్కున్నారు పవన్. 

బుధవారం మధ్యాహ్నం ఈ స్థలానికి సంబందించి పవన్‌కల్యాణ్‌ పేరుపై రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని ప్రజలకు చెప్పారు పవన్ కళ్యాణ్. సుమారు 50 లక్షలు చెల్లించి 3 ఎకరాల భూమిని పవన్ కొనుగోలు చేశారని సమాచారం. 
 


Comment As:

Comment (0)