Pawan Renu

పవన్‌ కల్యాణ్ డబ్బు మనిషి కాదు, ఆయనకే నా మధ్దతు - రేణూ దేశాయ్‌

స్పెషల్ రిపోర్ట్- పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పై వెల్లువెత్తుతున్న రాజకీయ విమర్శలపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్  (Renu Desai) స్పందించారు. పవన్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఆయన డబ్బు మనిషి కాదని ఆమె అన్నారు. ఈ మేరకు రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ను ముందు నుంచి ఇప్పటి వరకూ రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని చెప్పిన రేణూ దేశాయ్.. అదే సమయంలో తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని అంది.

పవన్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని, తనకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. పవన్ మనీ మైండెడ్‌ కాదు, డబ్బుపై ఆసక్తి లేదని, సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారని చెప్పింది. ఆయనకు పొలిటికల్‌ గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా.. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. ఇక ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండని విజ్ఞప్తి చేసింది. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే..అని చెప్పారు.. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు.. అని అన్నారు రేణూ దేశాయ్.
 


Comment As:

Comment (0)