Chiranjeevi

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలపై స్పందంచిన మెగాస్టార్ చిరంజీవి

తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో (Heavy Rains in Telugu States) అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. వర్షాభావ పరిస్తిల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. ఈమేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు.. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని.. అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా.. అని చిరంజీవి ట్విట్టర్-ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో ఇటు చంద్రబాబు సర్కార్, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాగాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో విద్యా సంస్థలుకు సోమవారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
 


Comment As:

Comment (0)